News August 13, 2024

బీఆర్ఎస్ హాయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: మంత్రి ఉత్తమ్

image

బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.

Similar News

News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News February 25, 2026

నల్గొండ: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 25, 2026

నల్గొండ: నిధుల లేమితో డీఆర్డీఏ సతమతం

image

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఖజానా ఖాళీ కావడంతో ఆరు నెలలుగా సుమారు రూ.60 వేల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎప్పుడు కరెంటు కోత విధిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేషనరీ ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారింది.