News August 13, 2024
బీఆర్ఎస్ హాయంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: మంత్రి ఉత్తమ్
బీఆర్‌ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు 39% మాత్రమే పూర్తయ్యాయని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్ల సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హాయాంలో 90% ప్రాజెక్టు పూర్తి చేశామని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.
Similar News
News September 7, 2024
సూర్యాపేట: క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి
ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది.
News September 7, 2024
దేశంలోనే సెకండ్ ప్లేస్.. నల్గొండకు రూ.25లక్షలు
నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్‌లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
News September 7, 2024
NLG: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు!
జిల్లాలో గతంలో మాదిరి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుపనున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సమకూర్చారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బందిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎన్నికల విధులకు అధికారులను, సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల, అధికారుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించారు