News December 18, 2024

బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌పై విచారణ జరిపించాలి: TNSF

image

కడప యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌పై ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించి, విచారణ జరిపించాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైవీయూ రిజిస్ట్రార్ పీ.పద్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అఫ్లియేషన్‌కు అనర్హత కలిగిన కళాశాలకు గుర్తింపు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భరత్ సింహా, కిషోర్, రవి, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2025

డిప్యూటీ సీఎంతో బీటెక్ రవి భేటీ

image

పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యురేనియం ప్రాజెక్ట్ నుంచి వెలువడుతున్న వ్యర్థాల నుంచి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అలాగే భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పునరావాసం, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. యురేనియం బాధితులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

News January 23, 2025

కడప సెంట్రల్ జైలు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కడప శివార్లలోని సెంట్రల్ జైలు సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందారని నిర్ధారించారు. రామాంజనేయపురం పరిధిలోని శ్రీరామనగర్‌కు చెందిన పడిగ ప్రవీణ్, వి. సుభాశ్‌లుగా గుర్తించారు.

News January 23, 2025

కడప: నేడు జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలు

image

కడప జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి తెలిపారు. 01-01-2002వ తేదీకి ముందు పుట్టిన క్రీడాకారులు ఎంపికలకు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు విజయవాడలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.