News November 6, 2024
బీఈడీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్న ఏయూ

AU లో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13 నుంచి జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను AU వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి.
Similar News
News January 11, 2026
విశాఖ: 20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 20 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.
News January 11, 2026
ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.
News January 10, 2026
బాలల రక్షణే లక్ష్యం: విశాఖ సీపీ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రోయాక్టివ్ పోలీసింగ్, ఫోరెన్సిక్ ఆధారాలతో వేగవంతమైన దర్యాప్తు, కోర్టు ప్రక్రియల్లో జాప్యం నివారణపై చర్చించారు. పోలీస్, న్యాయవ్యవస్థ, పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే బాలలకు భద్రత లభిస్తుందని, నేరస్థులకు కఠిన శిక్షలు పడతాయని సీపీ స్పష్టం చేశారు.


