News February 13, 2026

బీచ్ ఫెస్టివల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

సింగరాయకొండ మండలం పాకలలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. పనులు జరిగే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Similar News

News March 9, 2026

ప్రకాశం: ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట (M) పెట్లూరువారిపాలెంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కొనకనమిట్ల (M) కాట్రగుంటకి చెందిన మల్లెల అజయ్(19) ఆదివారం NSP కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల వార్డెన్ ఫిర్యాదుతో నరసరావుపేట SI కిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

ఆటో డ్రైవర్లకు SP సూచనలు

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు ఆదివారం సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, మద్యం సేవించి వాహణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్‌గా కనిపించేలా ఉండాలి, పోలీసు నంబర్ కూడా ఉండాలన్నారు.