News January 6, 2025
బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 21, 2025
ఒంగోలు: ‘కలెక్టరమ్మా.. కొడుకులు అన్నం పెట్టడం లేదు’
‘తల్లీ కలెక్టరమ్మా నాకు మీరే దిక్కు’ అంటూ కలెక్టర్ తమిమ్ అన్సారియాను సోమవారం ఓ వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయంలో వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద టంగుటూరు మండలం నిడమానూరుకి చెందిన తంపనేని సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు జిల్లా కలెక్టర్‌తో తన బాధను పంచుకుంది. కన్న కొడుకులే అన్నం పెట్టడం లేదని, కలెక్టరమ్మా మీరైనా తనకు న్యాయం చెయాలంటూ ఆ వృద్ధురాలు వేడుకుంది.
News January 21, 2025
అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 20, 2025
ప్రకాశం: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.