News January 5, 2025
బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 23, 2025
డిప్యూటీ CMతో బాలినేని భేటీ
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
News January 23, 2025
ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్‌లో ఉడకబెట్టాడు
రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.
News January 23, 2025
మార్టూరులో సినిమా స్టైల్‌లో దొంగతనం
మార్టూరులో సినిమా స్టైల్ లో బుధవారం దొంగతనం జరిగింది. బల్లికురవ మండలానికి చెందిన ఓ వ్యక్తి మార్టూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని సన్నిహితుడిని చూడటానికి వచ్చాడు. కారును రోడ్డు పక్కన ఉంచి ఆసుపత్రిలోకి వెళ్లాడు. అదును చూసిన దొంగలు తిరిగొచ్చేసరికి కారు అద్దం పగల కొట్టి అందులోని రూ.1.2 లక్షల నగదు, ల్యాప్‌టాప్, చెక్కు బుక్‌ను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.