News July 19, 2024
బీజాపూర్ హైవేపై 18 అండర్ పాసులు

ఔటర్ రింగురోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ గల మార్గంలో మొత్తం 18 అండర్పాస్ నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఈ 2 గ్రామాలు విస్తరించి ఉండడంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎక్కువగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.
Similar News
News October 1, 2025
రంగారెడ్డి: ‘స్థానిక’ పల్లకిలో ఓటర్లలో ఆశలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పోటీలో ఉండాలనుకునే ఆశావాహుల నుంచి సహజంగానే ఓటర్లు ఎంతో కొంత ఆశిస్తుంటారు. ప్రచారంలో భాగంగా రోజు వెంట వచ్చే కార్యకర్తలు, ముఖ్య నాయకులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అన్‌అఫిషియల్‌గా రాత్రి మద్యం సరఫరా చేయాల్సిందే. అసలే ఎన్నికల సమయం కావడంతో అడిగిన వాళ్లకు కాదంటే తమకు ఓటు వేయబోరనే భయంతో అడింది కాదనలేకపోతున్నట్లు తెలుస్తోంది.
News October 1, 2025
రంగారెడ్డి ‘లోకల్’లో టఫ్ ఫైట్

రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC , 230 MPTC, 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ZPTC స్థానాలకు 200- 210 మంది వరకు, MPTC స్థానాలకు 2,300 మంది వరకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ గుర్తులకు అతీతంగా నిర్వహించే ఒక్కో సర్పంచ్ స్థానానికి కనీసం ముగ్గురు- నలుగురు అభ్యర్థులు చొప్పున 2,000 మంది వరకు పోటీలో ఉండనున్నట్లు సమాచారం. ఇక వార్డులకు పోటీచేసే వారి సంఖ్య ఓ అంచనాకు రాలేదు.
News October 1, 2025
రంగారెడ్డి: ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి: కలెక్టర్

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.