News June 7, 2024
బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్.. ఆధిక్యంలో మల్లన్న

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
Similar News
News July 6, 2025
NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.
News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.