News August 28, 2024
‘బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నోటి దురుసు తగ్గించుకో..’

రైతు ఉద్యమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన నోటి దురుసు తగ్గించుకోవాలని ఏపీ రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి జీ.సోమన్న సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో రైతు ఉద్యమాన్ని అణచివేయకపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడతాయంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు ఉద్యమాన్ని అణచివేయాలని అధికార దాహంతో అన్నట్లుగా ఉందన్నారు.
Similar News
News April 13, 2026
కర్నూలు రేంజ్‌లో 25 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
News April 12, 2026
కర్నూలులో 3.1 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

కర్నూలు టౌన్ బళ్లారి చౌరస్తా సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు దాడి చేసి 3.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సహా కొనుగోలు, పంపిణీకి వచ్చిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులు అరకు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


