News February 16, 2025
బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పని చేయాలి: మంత్రి

బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నంద్యాలలో శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అభిరుచి మధు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
నల్గొండ: ‘నా కోరిక తీరిస్తే B.Ed పాస్ చేస్తా’

నల్గొండలోని డైట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు B.Ed విద్యార్థినిని వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తే B.Ed పాస్ చేయిస్తానని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికలకు ముద్దులు పెట్టడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అతడిని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
News September 19, 2025
రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్

రాజమండ్రి విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.కె.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న తిరుపతికి విమాన సర్వీస్ ప్రారంభం అవుతుందని చెప్పారు. వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసు నడుస్తుందని వెల్లడించారు.
News September 19, 2025
చీఫ్ ఇంజినీర్ ముందే బీఎన్ పనులు చేయలేమన్న కాంట్రాక్టర్

R&Bచీఫ్ ఇంజనీర్ (NDB) విజయశ్రీ ముందే రోడ్డు మరమ్మతులు చేయలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)నిధులతో నిర్మాణంలో ఉన్న జిల్లాలోని రోడ్లు శుక్రవారం పరిశీలించారు. బి.ఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలును పూడ్చాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులకు రూ.10 కోట్లు వెచ్చించామని ఇంతవరకు ఈ బిల్లు ఇవ్వనందున ఇక పనులు చేయలేమన్నారు.