News April 10, 2024
బీజేపీ ప్రచారానికి విదేశీ రాజకీయ పార్టీలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. తమ ప్రచారానికి 25 దేశాలకు చెందిన రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వాటిలో 13 దేశాల పార్టీలు ఆహ్వానాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల పార్టీల ప్రతినిధులు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఎన్నికలుండటంతో ఆ దేశపు పార్టీలను మాత్రం బీజేపీ ఆహ్వానించలేదని సమాచారం.
Similar News
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


