News February 19, 2025
బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా గోపీ

బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపోయిన గోపి నియామకమయ్యారు. గోపిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. పలువురు నాయకులు గోపీకి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 25, 2025
తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.
News November 25, 2025
మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
News November 25, 2025
మంచిర్యాల: భవన నిర్మాణ కార్మికుల బీమా పెంపు

భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బీమాను పెంచినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా అధికారులతో కలిసి బీమా పెంపు సంబంధిత గోడ ప్రతులు విడుదల చేశారు. ప్రమాద బీమా కింద లబ్ధి మొత్తాన్ని రూ.6నుంచి 10లక్షలకు పెంచామన్నారు. సహజ మరణానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు పెంచినట్లు వెల్లడించారు. డిసెంబర్ 3 వరకు అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బీమా ఆవశ్యకతపై వివరిస్తారన్నారు.


