News February 16, 2025

బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్ కోర్సు: మంత్రి శ్రీధర్ బాబు

image

గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్ల‌లో (జీసీసీ) తెలంగాణ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ద‌క్కేలా ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుంటుంద‌ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద్యోగాలు కోసం ప్ర‌య‌త్నిస్తున్న ప‌ట్ట‌భ‌ద్రులు స్కిల్స్ యూనివ‌ర్సిటీ వెబ్ సైట్‌ ( yisu.in ) త‌ర‌చూ సంద‌ర్శించాల‌ని మంత్రి సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News December 30, 2025

ఖలీదా జియా మరణం.. బంగ్లాతో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్లేనా?

image

బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ దేశ తొలి మహిళా ప్రధాని, BNP అధినేత్రి జియా <<18709090>>మరణం<<>> పెద్ద మలుపుగా మారింది. బంగ్లాలో ర్యాడికల్ గ్రూప్‌లు చెలరేగుతుండటంతో BNPతో భారత్‌ సత్సంబంధాల కోసం యత్నిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాతో కొత్త ప్రయాణానికి బ్రేక్ పడొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

News December 30, 2025

ఇంటర్‌తో 394 పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో 394 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగినవారు UPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: upsc.gov.in/

News December 30, 2025

2025లో ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

image

జూన్ 11న పొదిలికి YS జగన్ రాకతో ఉద్రిక్తత.
కల్తీ లడ్డూకు సంబంధించి సిట్ నోటీసులు అందుకున్న YV
కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి అరెస్ట్
ఒంగోలులో TDP లీడర్ వీరయ్య చౌదరి హత్య
వీరయ్య సతీమణికి గ్రంథాలయ ఛైర్మన్ పదవి
మార్కాపురం జిల్లాగా ప్రకటించిన CM
మాజీ MLA రాంభూపాల్ రెడ్డి కన్నుమూత
MLA ఉగ్రకు TDP అధ్యక్ష పదవి.