News June 16, 2024
బీటెక్, ఫార్మా-డీ పరీక్షా ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఫార్మా-డీ 5వ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు.
Similar News
News September 18, 2024
అనంత: మామిడి చెట్టుకు ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో రైతు మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో రైతు అమరేశ్ రెండెకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
అనంతలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం
అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.
News September 17, 2024
బద్రీనాథ్‌లో చిక్కుకున్న 40 మంది తాడిపత్రి వాసులు
తాడిపత్రికి చెందిన 40 మంది యాత్రికులు బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ రహదారిని మూసివేశారు. దీంతో నిన్నటి నుంచి రోడ్డుపైనే ఉంటున్న యాత్రికులు ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.