News March 3, 2025
బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
Similar News
News November 15, 2025
SBI కస్టమర్లకు BIG ALERT

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.
News November 15, 2025
వికారాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే.లలితా దేవి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీం ద్వారా నియమించిన వైద్య అధికారులకు ఉత్తర్వులు అందజేశారు. ప్రజలకు సేవాభావంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
News November 15, 2025
NZB: ప్రభుత్వ సలహాదారుని కలిసిన ఉద్యోగ సంఘాలు

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


