News September 12, 2024
బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News October 5, 2024
అనంత: దసరా సెలవులలో ఊళ్లకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
అనంతపురం: దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు సహకరించి సీసీఎస్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.
News October 5, 2024
అనంతపురం జిల్లా యువకుడిపై పోక్సో కేసు
అనంత జిల్లా యువకుడిపై HYD పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన లోకేశ్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఉంది. చనువు పెరగడంతో యువతి తన ఫొటోలను అతడికి పంపింది. ఇదే అదునుగా యువకుడు నగ్నవీడియోలు పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులతో ట్యాంక్ బండ్ వద్ద సూసైడ్ వరకు వెళ్లిన యువతి విషయాన్ని సోదరుడికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.