News March 29, 2025
బీడు భూముల్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ చివరలో 2 లక్షల ఎకరాల్లో మూడు నెలలు సెనగ పంట సాగుకు మాత్రమే పరిమితమై మిగిలిన కాలాన్ని వృథాగా ఉంచుతున్న బీడు భూముల్లో ఉద్యాన పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ జీ.రాజకుమారి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో నాణ్యమైన ఉల్లి, మిర్చి, పసుపు పెంపకం కోసం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News November 23, 2025
ఉమ్మడి నల్గొండలో ‘బడుగు’లకే పట్టం

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో అధిష్ఠానం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చింది. జిల్లాలోని మూడు అధ్యక్ష పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాలకే పెద్దపీట వేసింది. నల్గొండ, భువనగిరి జిల్లాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించగా, సూర్యాపేట జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎస్సీ సమాజానికి చెందిన నాయకుడికి అప్పగించింది. ఈ నిర్ణయం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
News November 23, 2025
ఖమ్మం: సామాన్య కార్యకర్త నుంచి జిల్లా సారథిగా..

ఖమ్మంకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వైరా నేత నూతి సత్యనారాయణ గౌడ్ రాజకీయ ప్రస్థానం దశాబ్దాల నాటిది. గతంలో ఆయన NSUI, యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
News November 23, 2025
పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.


