News April 25, 2024

బీఫామ్ అందుకున్న జయచంద్రా రెడ్డి

image

తంబళ్లపల్లె MLA సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డికే బీపాం అందింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె, అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోనే అభ్యర్థిని మార్చుతారని ఇన్ని రోజులు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News January 13, 2025

కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్ 

image

భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

News January 13, 2025

తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.

News January 13, 2025

‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.