News February 6, 2025
బీఫామ్ అందుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులు మీదుగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి బీఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 25, 2025
Stock Markets: 800 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్లు మరోసారి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయుల నుంచి కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 78,741 నుంచి మధ్యాహ్నం 800PTS మేర కుంగి 77,912 వద్ద కనిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం 78,023 (47) వద్ద చలిస్తోంది. నిఫ్టీ 23,869 నుంచి 23,627కు పడిపోయింది. 23,687 (30) వద్ద ట్రేడవుతోంది. సూచీకి 23800 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ట్రంప్ టారిఫ్స్‌తో నెగటివ్ సెంటిమెంటు పెరిగింది.
News March 25, 2025
కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను పదో తరగతి విద్యార్థి మహేశ్ కిరాతకంగా <<15871409>>కొట్టిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పదో తరగతి విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News March 25, 2025
ఢిల్లీ గెలుపుపై కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

లక్నోపై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుంది. మన గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్, బాల్, ఫీల్డ్‌లో మనం చాలా మెరుగుపరుచుకోవాలని నాకు తెలుసు. దయచేసి మాతో ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అని కెవిన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.