News October 24, 2024

బీఫార్మసీ ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బి ఫార్మసీ ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపారు. ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఈరోజు విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్సైట్ నుంచి విద్యార్థులు పొందవచ్చును.

Similar News

News November 14, 2025

విశాఖ: 2300 మందితో భద్రత

image

విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా సుమారు 2300 మంది(8 మంది ఐపీఎస్ అధికారులు, 8మంది ఏడీసీపీలు, 32 మంది ఏసీపీలు, 89 సీఐలు, 192 ఎస్.ఐలు, 2000(ఏ.ఎస్.ఐ,హెచ్.సి,పి.సి, హెచ్.జి)సిబ్బందితో సదస్సుకు పకడ్బందీగా భద్రతా భద్రతా ఏర్పాట్లు చేశారు.

News November 13, 2025

విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. అక్కడ నుంచి గవర్నర్ విడిది కేంద్రానికి వెళ్లారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నగరానికి చేరుకున్నారు.

News November 13, 2025

రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

image

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.