News April 11, 2025

బీబీనగర్‌లో రాకెట్ సామాగ్రి తయారీ

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్‌లో వినియోగించనున్న ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫొమ్ ప్యాడ్లతో పాటు ఇతర ముడి సామగ్రిని బీబీనగర్ మండలం జమీలపేట గ్రామంలోని వీఎన్డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో తయారు చేశారు. గురువారం రాకెట్ సామగ్రిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ పరిశోధన కేంద్రానికి తరలించారు.

Similar News

News October 23, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. KCR పిలుపు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్‌ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్‌ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.

News October 23, 2025

నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన ఛాంబర్‌లో హౌసింగ్, మెప్మా, మున్సిపల్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. గడువులోగా హౌస్ సైట్ మార్కౌట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 23, 2025

భీమడోలులో మహిళా దొంగ అరెస్ట్

image

బస్టాండుల్లో ప్రయాణికుల బ్యాగులను దొంగిలిస్తున్న మహిళను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన వేములపల్లి దుర్గ ప్రయాణికులను టార్గెట్ చేసి వారి బ్యాగులను దొంగిలిస్తుంది. నేడు నమోదైన ఓ కేసులో ఆమె నుంచి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.