News March 7, 2025

బీబీనగర్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల కేంద్రం నుంచి బ్రహ్మణపల్లి వెళ్లే రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు కొండమడుగు మాధవరెడ్డి కాలనీకి చెందిన కుతాడి బానుచందర్(21)గా పోలీసులు గుర్తించారు. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో వేగనియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News November 8, 2025

NLG: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో?!

image

నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రాజకీయ అండదండలు కొంతమంది దళారులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకుని దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం బెదరని మాఫియా యథేచ్ఛగా స్థానిక వాగుల నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రోజు వందల ట్రాక్టర్లలో ఇసుక విక్రయిస్తున్నారు.

News November 8, 2025

NLG: చర్చలు ఫలప్రదం.. బంద్ విరమణ

image

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్‌కు తెరపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈనెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నిర్ణయంతో శనివారం నుంచి కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

News November 8, 2025

శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

image

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.