News July 31, 2024

బీబీనగర్‌: అన్నదమ్ముల మృతి

image

బీబీనగర్‌-పోచంపల్లి రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బడుగు నరసింహ అనే వ్యక్తి మృతిచెందాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన నరసింహ అన్న బడుగు స్వామి అనారోగ్యంతో మహారాష్ట్రలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. పోచంపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సోదరుడు చనిపోయిన విషయం చెప్పాలని బీబీనగర్‌ నుంచి బైక్‌పై బయల్దేరాడు. బీబీనగర్‌ దాటిన వెంటనే ఎదురుగా వస్తున్న స్కూల్‌ బస్సు ఢీకొని చనిపోయాడు.

Similar News

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

News November 6, 2025

మిర్యాలగూడ: 100 గొర్రెలు మృతి

image

100 గొర్రెలు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో జరిగింది. పెన్ పహాడ్ మండలానికి చెందిన గొర్ల కాపర్లు సైదులు, నాగరాజు, కోటయ్య, శ్రీరాములు, ఉపేందర్ మరో ఇద్దరు కలిసి గొర్లను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం వేములపల్లి శివారుకు చేరుకున్నారు. అక్కడే మేపుతుండగా ఒకేసారి గొర్లు చనిపోయాయని కాపర్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.