News March 13, 2025
బీబీనగర్: బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం

బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురంలో బెల్ట్ షాపు మూసివేయాలని గ్రామస్థులు తీర్మానించారు. గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్థులంతా సమావేశం నిర్వహించి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం ఎవరైనా విక్రయిస్తే 25 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News November 26, 2025
జగిత్యాల: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ ఫీజు చెల్లించాలి

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షలు 2026 జనవరి/ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో 5 డిసెంబర్ 2025లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. అప్లై చేసిన అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని జిల్లా విద్య అధికారి కార్యాలయంలో డిసెంబర్ 19 లోగా సమర్పించాలన్నారు.
News November 26, 2025
కొడిమ్యాల: దేవాలయ మేనేజ్మెంట్పై కేసు నమోదు

కొడిమ్యాల గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి మెట్ల వద్ద ఆడుకుంటున్న తిప్పరవేణి నాగరాజు కుమార్తె మధుశ్రీ (11) డెకరేషన్ కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై మృతి చెందింది. భద్రతా నిర్లక్ష్యం కారణమని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆలయ మేనేజ్మెంట్పై కేసు నమోదు చేసినట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు.
News November 26, 2025
₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పథకం

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.


