News March 13, 2025
బీబీనగర్: బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం

బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురంలో బెల్ట్ షాపు మూసివేయాలని గ్రామస్థులు తీర్మానించారు. గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్థులంతా సమావేశం నిర్వహించి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం ఎవరైనా విక్రయిస్తే 25 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News March 27, 2025
సూర్యాపేట: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
గుంటూరు ఛానల్ ఆధునీకీకరణ చేస్తాం: సీఎం

గుంటూరు ఛానల్ ఆధునీకీకరణ, విస్తరణ పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో జిల్లా కలెక్టర్‌ల ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థలో పెండింగ్‌లో ఉన్న యూజీడీ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎంటీఎంసీ పరిధిలో యూజీడీ, తాగునీటి సరఫరాకు సీఆర్డీఏ ద్వారా నిధులు కేటాయిస్తామన్నారు. చినకాకాని, మల్లయపాలెం వద్ద ఇండస్ట్రీ పార్క్‌కు భూసేకరణకు నిధులు మంజూరు చేస్తామన్నారు.
News March 27, 2025
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఢిల్లీ ప్రభుత్వం మందుల సేకరణ విధానంపై సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రులు ఇకపై పీఎం జన ఔషధి కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపింది. మెడిసిన్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చేందుకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఢిల్లీ సర్కారు MoU కూడా కుదుర్చుకుంది.