News March 21, 2024
బీబీనగర్ వద్ద రైలు కింద పడి మహిళ దుర్మరణం

బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కిలోమీటర్ నెంబర్ 227/ 3-5 వద్ద ఎగువ లైన్లో 40 ఏళ్ల వయసు గల మహిళ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతురాలు తెలుపు రంగు చీర, పసుపుపచ్చ జాకెట్ ధరించారని వెల్లడించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచామని తెలిపారు.
Similar News
News February 15, 2025
బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

బొమ్మగాని <<15471432>>ధర్మభిక్షం <<>>ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ రవూఫ్‌పై విజయం సాధించారు.
News February 15, 2025
NLG: జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం.. తగ్గిన చికెన్ అమ్మకాలు

బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ లేనప్పటికీ చౌటుప్పల్, అక్కంపల్లి, చిట్యాల, సూర్యాపేట తదితర ప్రాంతాలలో వివిధ వ్యాధులతో కోళ్ల ఫారాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం తగ్గించారు. చికెన్ రేట్లు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అమ్మకాలు సరిగ్గా లేవని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు.
News February 15, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన జయంతి.