News July 14, 2024

బీబీపేటలో కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్

image

కానిస్టేబుల్, హోంగార్డ్ సస్పెండ్ అయిన ఘటన బీబీపేటలో చోటుచేసుకుంది. బీబీపేట ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డు రవి కలిసి 3 రోజుల క్రితం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగి కారుతో పోలీస్ స్టేషన్ గేటును ఢీకొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి ఏఎస్ఐ ప్రభాకర్‌ను బదిలీ చేసి కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు.

Similar News

News November 12, 2025

తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అడ్ హక్ కమిటీ నియామకం

image

తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా అడ్ హక్ కమిటీని బుధవారం కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కమిటీ సభ్యులుగా సూదం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజాక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ నియమితులయ్యారు. అదే విధంగా జిల్లా అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, ద్యావాడే సంజీవ్, శేఖర్ రాజ్, సంతోష్ నాయక్, తిరుపతి, రాములును నియమించారు.

News November 12, 2025

NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

image

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.

News November 12, 2025

NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

image

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.