News November 15, 2024
బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గాప్రసాద్ తెలిపాడు.
Similar News
News November 15, 2024
కామారెడ్డి: పోల్కంపేటలో ఆవును నరికి చంపారు..!
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లింగంపేట మండలం పోల్కంపేటలో సాకలి కాంతమయ్యకు చెందిన ఆవు మెడను గుర్తుతెలియని ఆగంతకులు రాత్రి గొడ్డలితో నరికి చంపారు. ఉదయం వచ్చి యజమాని చూడగా ఆవు రక్తపు మడుగులో ఉండడం చూసి బోరున విలపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు.
News November 15, 2024
కామారెడ్డి: ఏసీబీకి చిక్కిన పోలీసులు.. UPDATE
కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడి దగ్గరి నుంచి నుంచి సదరు పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రైటర్ రామస్వామికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.
News November 15, 2024
గ్రూప్-4 ఫలితాలు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మంది
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం గ్రూప్-4 తుది ఫలితాల ప్రకటనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మందిని ఉద్యోగులను కేటాయించింది. నిజామాబాద్ 360, కామారెడ్డి జిల్లాకు 188 ఉద్యోగులను కేటాయించినట్లు తెలిపింది. గత సంవత్సరం అనేక అవరోధాలను ఎదుర్కొని తదుపరి మూడు నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అనంతరం తుది ఫలితాలను ప్రకటించింది.