News November 15, 2024

బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’

image

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గప్రసాద్ తెలిపాడు. 

Similar News

News December 3, 2024

NZB: డిసెంబర్ 4 నుంచి జాగృతి ఉమ్మడి జిల్లాల సమావేశాలు

image

డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జాగృతి నాయకులు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4న వరంగల్ మరియు, నిజామాబాద్ 5న కరీంనగర్ & నల్గొండ, 6న రంగారెడ్డి మరియు ఆదిలాబాద్, 7న హైదరాబాద్ మరియు ఖమ్మం, 8న మెదక్ మరియు మహబూబ్‌నగర్ లో జరగనున్నాయి

News December 2, 2024

KMR: వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

image

వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News December 2, 2024

కామారెడ్డి: మద్యం తాగించి మరీ కొడుకును చంపేశాడు!

image

కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారు బ్రిడ్జి వద్ద రాజు(25) అనే యువకుడిని అతడి తండ్రి సాయిలు <<14765998>>హత్య<<>> చేయించిన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను రాజు నిత్యం వేధించేవాడు. విసిగిపోయిన సాయిలు.. అనిల్‌‌తో కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా రాజుకు మద్యం తాగించి బైక్‌పై బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు.