News January 22, 2025
బీర్కూర్: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వ్యక్తి

బీర్కూరు మండల పరిధిలోని నర్ర గంగారం అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.50 లక్షల మోసపోయానని వాపోయాడు. నర్రా గంగారం మొబైల్ ఫోన్కు ఓల్డ్ కాయిన్స్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రూ.99 వస్తాయని చెప్పి కొంత నగదు డిపాజిట్ కట్టాలని చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.1.50 లక్షలు సైబర్ నేరగాళ్లు మోసం చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 18, 2025
విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. రష్మిక పోస్ట్ వైరల్

విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు❤️’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే VDనే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో రష్మిక అతడిని <<15440673>>పొగుడుతూ<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News February 18, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి ధరలు ఇలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. కందులు గరిష్ఠంగా రూ.7250 వరకు పలికాయి. కనిష్ఠ ధర రూ.4259గా ఉంది. అనుములు రూ.5000 నుంచి రూ. 7000 మధ్య పలికాయి. మక్కలు రూ.2121 నుంచి రూ.2266 మధ్య పలికాయి. వరి ధాన్యం (HMT) రూ.2175, వరి ధాన్యం(JSR) రూ.2645గా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.
News February 18, 2025
వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.