News May 4, 2024

బీర్పూర్: వడదెబ్బతో రైతు మృతి

image

బీర్‌పూర్ మండలంలోని మంగేలా గోండుగూడెమునకు చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నువ్వు పంట కోయడానికి తన వ్యవసాయ భూమికి వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. నీరసంగా ఉందని పడుకోగా.. ఇంతలోనే భార్య నీళ్లు తాగమని లేపే సరికి అప్పటికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.

Similar News

News November 3, 2024

KNR: జిల్లా వ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం: కలెక్టర్

image

జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 27పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.

News November 3, 2024

జగిత్యాల: వరద కాలువలో దుంకి వృద్ధురాలు ఆత్మహత్య

image

కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇంట్లో ఉంటుంది. ఆసుపత్రిలో చూయించుకున్న నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

News November 2, 2024

మంథని: మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

image

మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, బల్మూరు వెంకట్‌కు ఎమ్మెల్సీ పదవి రావడం ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.