News August 23, 2024
బీర్ బాటిల్‌తో ఆర్టీసీ బస్సుపై దాడి

గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపోకి చెందిన డీలక్స్ బస్సుపైకి మందుబాబులు బీరు బాటిల్ విసిరారని ప్రయాణికులు తెలిపారు. V.M బంజార సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాటిల్ విండో గ్లాస్‌కు తగిలి సీట్లో కూర్చున్న మహిళ కంటికి గాయమైంది. ఆమెను V.M బంజార ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు V.M బంజర పోలీసులు తెలిపారు.
Similar News
News November 27, 2025
ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్’ వెలుగులు

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.
News November 27, 2025
ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ.. ఖమ్మంలో కూల్చివేతలు

ఖమ్మం నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్ కాంప్లెక్స్‌లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు.


