News October 17, 2024

బీసీలకు కవచం బీసీ రక్షణ చట్టం: మంత్రి సవిత

image

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదన్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

Similar News

News October 17, 2024

చిత్రావతికి వరద పెరిగే అవకాశం.. జాగ్రత్త: కలెక్టర్ చేతన్ 

image

కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి చిత్రావతి నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పరగోడు డ్యాం దాదాపు 80 శాతం నిండినట్లు తెలిసిందని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదకు చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇసుక కోసం నదీ పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు.

News October 17, 2024

ATP: వర్షానికి కూలిన ఇళ్లు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో మూడ్రోజుల నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు లేపాక్షి మండలం మామిడిమాకుల పల్లి గ్రామంలో హరిజన నారాయణప్పకు చెందిన ఇల్లు కూలింది. ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పాత ఇంటి పైకప్పు నాని కుప్ప కూలిందని బాధితుడు తెలిపారు. అలాగే గుత్తి చెర్లోపల్లి కాలనీలో రహమత్ బీ అనే మహిళ ఇల్లు పైకప్పు నేలకూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News October 16, 2024

వాల్మీకి జయంతోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన: కలెక్టర్

image

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవాలలో భాగంగా గుత్తి రోడ్ లో ఉన్న బల్లా కన్వెన్షన్ హాల్లో గురువారం జరగబోయే రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం పాతవూరు పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.