News September 23, 2024
బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలి: మాజీ మంత్రి
HYDలో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56% రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయాలి, కేంద్ర ప్రభుత్వం కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 7, 2024
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!
శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతుంది. జూరాల గేట్ల ద్వారా 21,603, విద్యుదుత్పత్తి చేస్తూ 37,252, సుంకేసుల నుంచి 26,874 మొత్తం 85,756 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తుంది. దీంతో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, AP జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ14,379 మొత్తం 49,694 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
News October 7, 2024
మహబూబ్‌నగర్: డీఎస్సీ UPDATE
ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC అభ్యర్థుల తుది జాబితా నేడు కొలిక్కి రానుంది. మొత్తం 1,077 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే ముగిసింది. 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు 2,636 మంది ఎంపిక కాగా 2,440 మంది హాజరయ్యారు. 1:1 జాబితా రాగానే వారికి పోస్టింగ్ ఇస్తామని విద్యాధికారులు తెలిపారు. ఈనెల 9న నియామక పత్రాలు అందించాక కొత్త టీచర్లకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.
News October 7, 2024
MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.