News December 23, 2024
బీసీలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు: మంత్రి సవిత
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్లో కంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీలకు రూ.135 కోట్లు చెల్లించారని, ఇప్పుడు అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News December 24, 2024
మోసపూరిత ప్రచారాలతో జాగ్రత్త: జేసీ అభిషేక్
వినియోగదారులు మోసపూరిత ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News December 24, 2024
రాప్తాడులో జగన్ ఫ్లెక్సీల చించివేత
రాప్తాడు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ నెల 21న జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. అయితే సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటనపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 24, 2024
అనంతపురం జైలుకు తెలంగాణ యువకుడు
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్ను అనంతపురం గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. కాగా సీఎం కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ టీఎన్ఎస్ఎఫ్ నేత మహమ్మద్ రఫీ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.