News April 10, 2024
బీసీవై పార్టీ పత్తికొండ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లు

భారత చైతన్య యువజన పార్టీ(బిసివై) పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వెంకటేశ్వర్లు సామాన్య రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. బీసీ యువనేతగా ఉన్న ఆయనకు సర్వే ద్వారా సీటు కేటాయించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
Similar News
News February 7, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.
News February 7, 2026
ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూల్ డీఆర్‌వో వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రవాణా, విద్యుత్, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News February 7, 2026
వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు జిల్లాలో వాయిస్ క్లోనింగ్ ద్వారా జరిగే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. AI సాయంతో బంధువులు లేదా స్నేహితుల గొంతును క్లోన్ చేసి అత్యవసర సహాయం పేరుతో డబ్బులు అడిగే ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డబ్బులు పంపకుండా, తెలిసిన నంబర్‌కు స్వయంగా ఫోన్ చేసి వారి వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు.


