News March 17, 2025
బీసీ ఎమ్మెల్యేలతో మంత్రుల సమావేశం

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలన్నారు.
Similar News
News October 23, 2025
తిరుపతి రూయాలో ముగ్గురు మృతి

తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో 60, 65, 55 ఏళ్లు వయసు గల ముగ్గురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ పోలీసులు గురువారం మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులుగా గుర్తించారు. మృదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుల ఆధారాలు గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలన్నారు.
News October 23, 2025
391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
News October 23, 2025
ఏపీలో 23 ఉద్యోగాలు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్సైట్లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.