News February 7, 2025

బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం: మంత్రి కొండా

image

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా చేప‌ట్టిన బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డ‌గా తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండ్‌కు లేఖ‌లు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు పంపినట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

వరంగల్: రైతులకు కొరకరాని కొయ్యగా మారిన కొత్త నిబంధనలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పత్తి కొనుగోలు నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీసీఐ అధికారులు ఒక్కో రైతు ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కపాస్ యాప్ ద్వారా మాత్రమే స్పాట్‌ బుకింగ్‌ చేయాలనే నియమం రైతుల ముందున్న మరో అడ్డంకిగా మారింది.

News November 14, 2025

బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!

image

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలతో పలు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బిహార్‌లో మొత్తం 2,616 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 38 జిల్లాల్లోని 46 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు ఈసీ 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.

News November 14, 2025

నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

⋆ 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం (ఫొటోలో)
⋆ 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం
⋆ 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం
⋆ జాతీయ బాలల దినోత్సవం
⋆ తెలంగాణ నీటిపారుదల దినోత్సవం
⋆ ప్రపంచ మధుమేహ దినోత్సవం