News January 31, 2025
బీసీ బహుజన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మురళీకృష్ణ

తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను నియమించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన వారి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 15, 2025
MHBD:ఈ కుర్చీకి అధికారం దక్కేది ఎప్పుడో..!

మహబూబాబాద్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి ఎవరికీ దక్కేది ఎప్పుడని స్థానిక అధికార పార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రంథాలయానికి ఛైర్మన్ను నియమించలేదు. గ్రంథాలయానికి ఛైర్మన్ పాలకమండలి లేకపోవడంతో గ్రంథాలయం సమస్యలను పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఛైర్మన్ను నియమించలేదు.
News October 15, 2025
పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.
News October 15, 2025
22 నుంచి కపిలతీర్థంలో కార్తీకమాస ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీకమాస ఉత్సవాలు జరగనున్నాయి. నెల రోజులు పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 22న హోమాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. 22 నుంచి 23వ తేదీ వరకు శ్రీగణపతి స్వామివారి హోమం, 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీసుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరుగనుంది.