News January 31, 2025
బీసీ బహుజన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మురళీకృష్ణ

తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను నియమించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన వారి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 8, 2025
రెబ్బెన: గంగాపూర్ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

రెబ్బెన మండలం గంగాపూర్‌లో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరను అధికారులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భారీ కేడ్లు, తాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.
News February 8, 2025
సంగారెడ్డి: 9న ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
News February 8, 2025
బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల

బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్‌పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.