News March 17, 2025

బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి:మంత్రి పొన్నం

image

బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడాగట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు.  మొదటిసారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ పెంచుతూ బిల్లు ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. మంత్రి కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 14, 2025

వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

image

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 14, 2025

‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.