News September 19, 2024

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

image

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.

News November 30, 2025

రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.

News November 30, 2025

HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

image

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.