News November 11, 2024
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్: మంత్రి సవిత
బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి శిక్షణ ఇస్తామని, అభ్యర్థులకు నెలకు రూ.1,500 స్టైపండ్ అందజేస్తామన్నారు.
Similar News
News December 14, 2024
పట్టుదల ఉంటే ఉద్యోగం మీ సొంతం: మంత్రి పయ్యావుల
గ్రామీణ నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటే సులభతరంగా ఉద్యోగాలు పొందవచ్చని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా కృషి, పట్టుదలను అలవర్చుకోని ఉద్యోగ అన్వేషణలో ముందడుగు వేయాలని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సంబంధం లేకుండా అనుభవాన్ని పెంచుకోవడానికి వచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 14, 2024
అనంతపురంలో కేజీ టమాటా రూ.10
టమాటా ధరలు పడిపోయాయి. ఆయా రాష్ట్రాలో దిగుబడి పెరగడంతో అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.10కి చేరింది. కనిష్ఠంగా రూ.4, సరాసరి రూ.6తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు కూడా పడిపోయాయి. మొన్నటి వరకు టన్ను రూ.30వేలకు పైగా పలకగా తాజాగా గరిష్ఠంగా రూ.29 వేలతో అమ్ముడవుతోంది.
News December 14, 2024
అనంత: స్నేహితుని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
స్నేహితుని హత్యకేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ అనంతపురం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ మణికంఠను తన స్నేహితులు మద్యం మత్తులో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.