News September 1, 2024
బీ అలర్ట్.. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News October 23, 2025
నాగార్జునసాగర్: సాధించిన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుత్తును ఉత్పత్తి చేసిందని జెన్కో సీఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది 70 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారం రాత్రికి ఆ లక్ష్యాన్ని మించి ఉత్పత్తిని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐడల్ డైరెక్టర్ అజయ్ కుమార్ విద్యుత్ అధికారులను అభినందించారు.
News October 23, 2025
NLG: డీసీసీ అధ్యక్ష పదవికి 20 మంది దరఖాస్తు

నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల పరిశీలకులు బిశ్వరంజన్ మహంతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న 20 మందిలో 10 మంది బీసీలు, నలుగురు ఓసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. ఈ దరఖాస్తుదారుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
News October 23, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు.