News April 5, 2025

బీ.కొత్తకోటలో మహిళపై లైంగికదాడి.. కేసు నమోదు

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బీ.కొత్తకోట సీఐ జీవన్ గంగానాథబాబు తెలిపారు. బీ.కొత్తకోట కురవోని వంక కాలనీలో ఉండే పద్మావతిని 6 నెలల నుంచి తేరువీధిలో ఉండే కలందర్ వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గత నెల 31న కలందర్ లైంగిక దాడికి పాల్పడడంతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 18, 2025

వేములవాడ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

image

వేములవాడ ఏరియా ఆసుపత్రిని కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం సందర్శించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.