News November 13, 2024

బుకింగ్ కేంద్రాల్లో ఇసుక పంపిణీ పారదర్శకంగా జరగాలి

image

నిర్దేశించిన ఇసుక పంపిణీ సజావుగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక సరఫరా సంబంధిత అంశాల సమాచారం కోసం 08562246344 అనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్డీవో తమ పరిధిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రతి స్టార్ట్ పాయింట్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.

Similar News

News December 8, 2025

కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

image

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.

News December 8, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780

News December 8, 2025

కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.