News April 1, 2025
బుక్కపట్నం: డైట్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తూ.. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ కలిగిన స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 10 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News December 19, 2025
మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

నిర్వహణ లోపం వల్ల కోల్‌కతాలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్‌గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.
News December 19, 2025
రాజమండ్రి: ‘క్లాట్’ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి ప్రభంజనం

రాజమండ్రి శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థలు ‘క్లాట్’ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంస్థకు చెందిన డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ విద్యార్థిని ఎస్. శ్రీ సాయి గీతిక జాతీయ స్థాయిలో 3వ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు ముగ్గురు, 500 లోపు 12 మంది ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు.
News December 19, 2025
మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.


