News December 31, 2024

బుక్కరాయసముద్రం హత్య కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

బుక్కరాయసముద్రంలోని ఆనంతసాగర్ కాలనీకి చెందిన రత్నమయ్యకు హత్య కేసులో ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. అదే కాలనీకి చెందిన వినోద్ కుమార్‌ను ఛాతీపై పొడవడంతో మృతి చెందగా 2022లో కేసు నమోదైంది. పలుమార్లు సాక్షులను విచారించిన న్యాయస్థానం.. నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది.

Similar News

News January 7, 2025

JNTUA పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన MBA 3, 4 సెమిస్టర్లు, MCA 3, 4, 5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News January 7, 2025

‘అనంతపురం జిల్లాలో హెచ్ఎంపీవీ కేసులు లేవు’

image

చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News January 6, 2025

కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు

image

కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.