News February 8, 2025
బుగ్గారం: ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అక్కల సునీత, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 26, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News November 26, 2025
సర్పంచులకు జీతం ఎంతంటే?

TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సర్పంచుల జీతంపై చర్చ జరుగుతోంది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఉండేది. ఆ తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13,000, జడ్పీ ఛైర్మన్లకు రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.
News November 26, 2025
సిద్దిపేట: కొంపముంచిన రొటేషన్ పద్ధతి.. బీసీలకు తగ్గిన సీట్లు !

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు రొటేషన్ విధానంతో రిజర్వు కేటాయించడం బీసీలను దెబ్బతీసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా బీసీలకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఖరారు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం 207 కేటాయించగా ఇప్పుడు136 మాత్రమే దక్కాయి. దీనిపై మీ కామెంట్.


